కేరళ లోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ప్రజలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా "నా ప్రియమైన వయనాడ్ సోదర, సోదరీమణులారా" అంటూ లేఖను పోస్ట్ చేశారు. వయనాడ్ నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండవచ్చు... కానీ ప్రజల తరఫున పోరాటం చేయడం కొత్త కాదు అని అందులో పేర్కొన్నారు.కొన్ని నెలల క్రితం తాను, తన సోదరుడు రాహుల్ గాంధీ మండక్కై, చూరాల్‌మల వెళ్లామని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి సృష్టించిన బీభత్సాన్ని కళ్లారా చూశానన్నారు. ఆ కష్టాల నుంచి బయటపడి మీరు ముందుకు కదిలిన తీరు స్ఫూర్తిదాయమని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధిగా పోటీ చేయడం నాకు కొత్త కావొచ్చు... కానీ ఎప్పుడూ ప్రజల తరఫున గళం వినిపిస్తూనే ఉన్నానని వెల్లడించారు. ఈ కొత్త ప్రయాణంలో తనకు వయనాడ్ ప్రజలు మార్గదర్శకంగా నిలుస్తారని భావిస్తున్నానని ప్రియాంక పేర్కొన్నారు.

కాగా వయనాడ్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీచేస్తుండగా.. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నుంచి సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీ నుంచి నవ్య హరిదాస్‌ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ తన రాజకీయ అనుభవం ఆధారంగా ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. సింగపూర్, నెదర్లాండ్స్‌లో పనిచేసిన నవ్య కోజికోడ్‌ కౌన్సిలర్‌గా ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos