రాజీవ్ గాంధీ కుమార్తె . .. రూపు రేఖల్లో ఇందిరాగాంధీలా ఉండే ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చాలా కాలంగా ఆమె పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నా నేరుగా ఎన్నికల బరిలోకి ఎప్పుడూ దిగలేదు. తాజాగా వాయనాడ్ ఉప ఎన్నికల బరిలో దిగాలని ప్రియాంక నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టిక్కెట్ ప్రకటించింది.

ప్రియాంకా గాంధీ ఇప్పటిదాకా చట్ట సభలలో అడుగు పెట్టలేదు. ఆమె తన తల్లి వదిలేసిన రాయబరేలీ నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ అక్కడ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. ఇక రాహుల్ వదిలేసిన అమేధీ నుంచి ప్రియాంక పోటీ పడుతుందని అనుకుంటే శర్మ అనే కాంగ్రెస్ విధేయుడికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ 2019, 2024లో వరసగా రెండు సార్లు గెలిచిన వయనాడ్ ఎంపీ సీటు ఖాళీ అయింది. రాహుల్ గాంధీ రాయబరేలీ ఉంచుకుని వయనాడ్ త్యాగం చేశారు. అదిపుడు చెల్లెమ్మకు అంకితం అవుతోంది.

పైగా ఉత్తరాదిన అన్న .. దక్షిణాదిన చెల్లెమ్మ అన్న లెక్కలు కూడా సరిపోతాయని అంటున్నారు. కేరళలోని వాయనాడు కాంగ్రెస్ కి కీలక ప్రాంతం. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ని పక్కన పెట్టి మరీ కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలు వస్తే కనుక కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.

ఇక దేశంలో కూడా ఇండియా కూటమి హవా బాగానే ఉంది. దాంతో భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రియాంకా గాంధీ ఎన్నికలలో పోటీకి సిద్ధపడుతున్నారని అంటున్నారు. ప్రియాంకాగాంధీ ఈ ఉప ఎన్నికల్లో గెలవడం ఖాయమని అంటున్నారు. గెలిచిన తరువాత ప్రియాంక పార్లమెంట్ లో అన్న రాహుల్ పక్కన చేరి మోడీకి మరో సవాల్ గా మారుతారా అన్న చర్చ కూడా ఉంది.

అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా లెక్కలు మారుతాయని అంటున్నారు. నవంబర్ 13న వాయనాడ్ లో ఉప ఎన్నిక జరుగుతుంది. 23న ఫలితాలు వస్తాయి. వాయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలుపొంది కేవలం ఎంపీ అవడమే ఆమె టార్గెట్ కాదు. దక్షిణాది మొత్తం కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నాలను ఆమె చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది చాలా ముఖ్యం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగోసారి ఓడిపోకుండా ఉండాలంటే… కర్ణాటక, తెలంగాణలో పార్టీని చక్కదిద్దుకోవాలి. ఏపీలో వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. వయనాడ్ ఎంపీ హోదాలో ఇక ప్రియాంక ఆ ప్రయత్నాలు చేస్తారని అనుకోవచ్చు. సో.. వాయనాడ్ ఎన్నికతో కాంగ్రెస్ పార్టీకి గాంధీల ఆడపడుచు ఏ రకమైన జోష్ ని తెస్తారో వేచి చూడాల్సిందే.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos