క్లాసులో విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్‌ను సర్వీస్ నుంచి తొలగించినట్లు కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర శుక్రవారం తెలిపారు. బెంగళూరు శివార్లలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆ కాలేజీ యజమాని అయిన మంత్రి పరమేశ్వర.. ఈ వివాదంలోకి తన పేరును లాగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం క్లాస్ జరుగుతుండగా వాలే చంద్రు అనే ప్రొఫెసర్, ఓ విద్యార్థినికి చాక్లెట్లు పంచి, అందరి ముందు "ఐ లవ్ యూ" అని చెప్పి ప్రపోజ్ చేశాడు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ విషయంపై మాట్లాడాలనుకుంటే ప్రిన్సిపాల్ వద్దకు రావాలని గట్టిగా నిలదీసింది. నీవు కూడా ఇదివరకే నాకు ఐ లవ్ యు అని చెప్పావని.. దీనికి సంబంధించిన ఆధారాలు సీసీటీవీలో ఉన్నాయని ప్రొఫెసర్ చెప్పగా, వెంటనే చూపించాలని ఆమె సవాలు చేసింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన విద్యార్థిని అతడిని చెప్పుతో కొట్టినట్లు సమాచారం. అనంతరం, తోటి విద్యార్థులు అతడిని క్యాంపస్ అంతా తరిమి, కారు వద్ద దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.

ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి పరమేశ్వర, "నా కాలేజీలో ఏదైనా జరిగితే నా పేరు లాగుతారు. ఇతర కాలేజీల్లో ఏమీ జరగవా? అన్నింటికీ హోంమంత్రినే బాధ్యుడిని చేస్తారా?" అని ప్రశ్నించారు. అర్హతల ఆధారంగానే ప్రొఫెసర్‌ను నియమించామని, తప్పు చేసినట్లు తేలడంతో క్రమశిక్షణా చర్యల కింద ఉద్యోగం నుంచి తొలగించామని స్పష్టం చేశారు. "నాకు అందిన సమాచారం ప్రకారం, అతడిని కాలేజీ నుంచి తొలగించారు. ఇందులో గొప్పగా చెప్పడానికేముంది?" అని మంత్రి అన్నారు. నెలమంగళ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన నమోదు కాగా, నిందితుడైన ప్రొఫెసర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos