రెండు వారాల కిందటి వరకూ... తెలంగాణలో భారీ, అతి భారీ వర్షాలు కురిసి... రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి మరవకముందే... మళ్లీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 18వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని... 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఆసిపాభాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ లో ఆకాశం సాధారణంగా మేఘావృత్తమై ఉంటుందని... నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావారణ శాఖ తెలిపింది. ఇక..  తెలంగాణలో ... ఓ రకంగా చెప్పాలంటే రైతులకు అవసరమైన సమయంలో వానలు పడలేదని చెప్పొచ్చు. జూన్‌లో తగినంత వర్షపాతం నమోదు కాక విత్తనాలు మొలకెత్తలేదు. ఫలితంగా చాలా జిల్లాల్లో విత్తనాలు మురిగిపోయిన పరిస్థితి కనిపించింది. జులైలో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఇక ఆగస్టు నెలలోనూ జూన్ నెల నాటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా వాతావరణ శాఖ వర్ష సూచన చేయటంతో… మళ్లీ వానలు పడే అవకాశం కనిపిస్తోంది. వానలు పుష్కలంగా కురిసి... పంటలు బాగా పండాలని సర్వత్రా అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారు

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos