దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ పాఠశాల సమీపంలో భారీ పేలుడు సంభ‌వించిన ఘ‌ట‌న‌పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును మ‌రింత‌ ముమ్మరం చేశారు. ఈ కేసును ఉగ్రకోణంలో ఎన్​ఐఏ కూడా దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు "జస్టిస్ లీగ్ ఇండియా" అనే టెలిగ్రామ్ ఛానల్‌పై ఆరాతీస్తున్నారు. ఈ ఛానెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని టెలిగ్రామ్‌ సంస్థకు లేఖ కూడా రాశారు. దీంతోపాటు సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలను సైతం ఇవ్వాల‌ని ఆ లేఖ‌లో కోరారు.

ఢిల్లీ పోలీసుల అనుమానాల‌కు బ‌ల‌మైన ఆధారాలు ఉన్న‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా.. సీఆర్​పీఎఫ్​పాఠశాల వద్ద బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుజేజీతో సహా పూర్తి వివ‌రాలు "జస్టిస్ లీగ్ ఇండియా" టెలిగ్రాం ఛానల్‌లో ప్రసారం చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, జస్టిస్ లీగ్ ఇండియా టెలిగ్రామ్‌ గ్రూప్‌లో.. భారత ఏజెంట్లు ఖలిస్థాన్‌ వేర్పాటువాదులను మట్టుబెట్టడానికి చేపట్టిన చర్యలకు ప్రతీకారంగా ఈ పేలుడు జరిపినట్లు అందులో పోస్ట్​చేసింది. 'కొందరు గూండాలతో భారత నిఘా ఏజెన్సీ మా సభ్యుల నోరు మూయించాలని చూస్తే, ప్రపంచంలో వారికంటే మూర్ఖులు ఉండ‌రు. మేము వారికి ఎంత దగ్గరగా ఉన్నామో ఏమాత్రం ఊహించలేరు. ఏక్షణమైనా దాడి చేయగల సత్తా మా దగ్గర ఉంది. ఖలిస్థాన్‌ జిందాబాద్‌' అనే మెసేజ్ 'జస్టిస్‌ లీగ్‌ ఇండియా' పోస్టులో ఉంది. ఈ కార‌ణంగా పేలుడు ఘటనలో ఖలిస్థానీ కోణంపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు టెలిగ్రామ్ సంస్థ‌కు లేఖ రాసిన‌ట్లు స‌మాచారం.

ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై టెలిగ్రామ్ సంస్థ నుంచి స‌మాచారం రాలేదు. అంతేకాదు, ఈ పేలుడుకు సంబంధించి ఏ సంస్థ పేరూ బ‌య‌ట‌కు రాలేదన్నారు. అలాగే, పేలుడు ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ఢిల్లీలో ఇప్ప‌టికే హై అలర్ట్‌ ప్రకటించడంతోపాటు అధికారులు పాఠశాల సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ అనుమానిత వ్య‌క్తిని గుర్తించారు. ఆ వ్య‌క్తి పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో సంచ‌రించిన‌ట్లు చెబుతున్నారు. అలాగే, ఓ క‌వ‌ర్‌లో ఏదో చుట్టి, పేలుడు ప్ర‌దేశంలో విసిరిన‌ట్లు అనుమానిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

15-49-17-0617.jpg

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-06-22 Time: 03:49:17

15-31-26-0626.jpg

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
2026-06-22 Time: 03:31:26

17-02-16-0616.jpg

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు
2026-06-20 Time: 05:02:16

14-06-28-0628.jpg

90వ రోజు ప్రజాదర్బార్.. వివిధ సమస్యలపై ప్రజల  వినతుల స్వీకరణ.. అన్నివిధాల అండగా ఉంటానట్టు  మంత్రి లోకేష్ హామీ
2026-06-16 Time: 02:06:28

14-04-35-0635.jpg

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. సింగపూర్‌లో సెమీకండక్టర్లపై సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో సీఎం చంద్రబాబు
2026-06-16 Time: 02:04:35

Related Videos