తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార - ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చిన్న అవకాశం దొరికినా వదలకుండా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ... తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో వర్షాలు, వరదలపై కేటీఆర్ ను కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ... హైదరాబాద్ విశ్వనగరంపై ఆ ఇద్దరు నేతలు మాట్లాడాలని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి... ఇప్పుడు తాజాగా రైతుల సమస్యలపై కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. గతంలో వరి వేస్తే ఉరేనని కేసీఆర్ చెప్పారని గుర్తు చేస్తూ... కేసీఆర్ చెప్పే దానికి చేసే దానికి పొంతన లేదని వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి ... అనగనగా ఓ కేసీఆర్ అంటూ మొదలుపెట్టి కథలు కంచికి- కేసీఆర్ ఫాంహౌస్ కి అంటూ ముగించారు. యూరియా కోసం రైతులు ...... తిప్పలు పడుతున్నారంటూ ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని తన ట్వీట్ కు జోడించారు. ఎండలో రైతులు గంటల తరబడి నిలుచునేలా చేశాడంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. రైతులకు కావాల్సిన ఎరువులను ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అంతేకాదు 24 గంటల కరెంటు అన్నాడని, కానీ లాగ్ బుక్ చూస్తే పట్టుమని పది గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని తెలుస్తుందని పేర్కొన్నారు. రైతులు గంటల తరబడి క్యూలలో నిలుచున్నప్పటికీ ఎరువులు అందడం లేదని రేవంత్ రెడ్డి ... కేసీఆర్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos