కేంద్ర వార్షిక బడ్జెట్‌ 2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మొత్తం రూ. 50,65,345 కోట్లతో  ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట లభించింది. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది కేంద్రం. ఏఏ రంగాలకు ఎంత మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారనేది  ఆసక్తిదాయకంగా మారింది.

వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా..!

రక్షణ రూ. 4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు
హోం రూ. 2,33,211 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు
విద్య రూ. 1,28,650 కోట్లు
ఆరోగ్య రూ. 98,311 కోట్లు
పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు
ఐటీ, టెలికాం రూ. 95,298 కోట్లు
విద్యుత్‌ రూ. 81,174 కోట్లు
వాణిజ్య, పరిశ్రమలు రూ. 65,553 కోట్లు
సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు
వైజ్ఞానిక విభాగాలకు రూ. 55,679 కోట్లు

కేంద్రానికి వచ్చే ఆదాయం...
----------------
ఆదాయపన్ను నుంచి 22 శాతం
కేంద్ర ఎక్సైజ్‌ నుంచి 5 శాతం
జీఎస్టీ,ఇతర పన్నుల నుంచి 18 శాతం
కార్పొరేషన్‌ పన్ను ద్వారా 17 శాతం
కస్టమ్స్‌ ద్వారా... 4 శాతం
అప్పులతో కాని క్యాపిటల్‌ రిసిప్ట్స్‌ ద్వారా 1 శాతం
పన్నేతర ఆదాయం 9 శాతం
అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుంది.

కేంద్ర ఖర్చులు..
----------------
వడ్డీ చెల్లింపులకు 20 శాతం
కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం
కీలక సబ్సిడీలకు 6 శాతం
రక్షణ రంగానికి 8 శాతం
రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం
ఫైనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీల ద్వారా 8 శాతం
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం
ఇతర ఖర్చులకు 8 శాతం
పెన్షన్స్‌కు 4 శాతం

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos