దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుడిచి పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ మిషన్ -2026 గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వాతావరణం వేడెక్కింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్ కగార్‌ను పునఃప్రారంభించాయి. ఈసారి కర్రె గుట్టల హిల్స్‌ను టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం. అందుకే దీనికి ఆపరేషన్ కేజీహెచ్‌-2ను ప్రారంభించాయి. ఒకవైపు సరిహద్దుల్లో రెండు వేల మంది సాయుధ బలగాల మోహరించారు. మరోవైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లా అటవీప్రాంతాల్లో అగ్రనేత బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌తోపాటు బడానేతలు సంచరిస్తున్నారనే సమాచారరంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31 గడువు దగ్గర పడుతోంది. కేవలం ఇంకో నలభై రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఈలోపు.. ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టులను తుదముట్టించాలని ప్రభుత్వం ఆపరేషన్‌ను తీవ్రం చేసింది. సీఆర్‌పీఎఫ్‌, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ కేజీహెచ్‌-2 చేపడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నంబి ప్రాంతం నుంచి వ్యాపించి ఉన్న కర్రెగుట్టల అడవుల్లో ఈ వేట కొనసాగిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జి అలియాస్‌ చేతన్, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జి కేసా సోధీ, బడే చొక్కారావులాంటి పెద్ద తలకాయలను పట్టుకోవడమే లక్ష్యంగా రెండు వేలకుపైగా బలగాలతో అడవిలో అణువణువూ గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది ఏప్రిల్‌లలో ఇదే ర్రెగుట్టల్లో నిర్వహించిన 21రోజుల సుదీర్ఘ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చారు. కానీ అగ్రనేతలు మాత్రం తప్పించుకున్నారు. ఈసారి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనే పట్టుదలతో బలగాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తడపల, పామునూరు, మురుమూరు, డోలి వంటి ప్రాంతాల్లో నిరంతర నిఘా పెట్టారు. 

తెలంగాణలోని ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్ షెల్టర్ తీసుకున్నారని పక్కా సమాచారం అందింది. అందుకే ఈ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. దామోదర్‌ స్వస్థలమైన తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆ గ్రామం నుంచి కీలక సమాచారం బయటకు వెళుతుందని అనుమానంతో నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండికామారం వంటి ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలోని అత్యంత శక్తిమంతమైన నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు ఈ ఆపరేషన్‌లో భాగస్వామ్యం అయ్యాయి. ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాలు మ తాత్కాలిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

          

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos