ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని మీడియా ఛానెళ్లు తమ కూటమిపై విషం చిమ్ముతున్నాయంటూ ... వాటిని నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. తమకు వ్యతిరేకంగా షోలు, డిబేట్లు పెడుతున్న యాంకర్ల జాబితాలను కూడా సిద్ధం చేస్తోంది. కూటమికి వ్యతిరేకంగా పనిచేసే యాంకర్లు, షోల పేర్లను కోఆర్డినేషన్ కమిటీలోని సబ్ గ్రూప్ రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఆ కమిటీ త్వరలోనే ఛానెళ్లు, షో ల పేర్లు వెల్లడించనుంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంటిలో జరిగిన భారత సమన్వయ కమిటీ తొలి సమావేశంలో ... ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మీడియాలోని ఒక విభాగం కక్షపూరితంగా వార్తలను వండివారుస్తోందని ప్రతిపక్షం పదేపదే ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా, మీడియాలోని ఒక వర్గం తమకు తక్కువ కవరేజీ ఇస్తోందని, కావాలనే తమపై బురద చల్లుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడా యాత్రకు ప్రజల మద్దతు లభించిందని, సోషల్ మీడియాలో సైతం విపరీతమైన స్పందన వచ్చిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.
కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం బీజేపీ నేతలకు వత్తాసు పలికిందని... మరికొన్ని మీడియా సంస్థలు మోదీ, బీజేపీ బెదిరింపులకు భయపడి జోడో యాత్రకు తగిన ప్రచారం ఇవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమికి వ్యతిరేకంగా, బీజేపీ కి అనుకూలంగా భజన చేసే మీడియాను నిషేధించాలని నాయకులు సూచించారని చెప్పారు.
రాహుల్ భారత్ జోడో యాత్రకు అన్నివర్గాల నుంచి భారీ స్పందన వచ్చిందని, అయితే మీడియా చానెళ్ల ఎడిటర్లు కావాలనే యాత్రను కవర్ చేయకుండా బహిష్కరించారని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. లక్షల మంది ప్రచారంలో పాల్గొటున్నా, ప్రజల నుంచి భారీ స్పందన వచ్చినా మీడియా చూపించలేదని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ ఇలాగే మీడియాను బహిష్కరించింది. 2019 మే మాసంలో ఒక నెలపాటు టెలివిజన్ షోలను బహిష్కరించింది. తాజాగా ఒక నెలపాటు టెలివిజన్ చర్చలకు అధికార ప్రతినిధులను పంపకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఎండింగ్ యాంకర్
‘అన్ని మీడియా ఛానెళ్లు, ఎడిటర్లు తమ షోలలో కాంగ్రెస్ ప్రతినిధులను ఉంచొద్దని అభ్యర్థిస్తున్నాం’ అని పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇదేసమయంలో ... దేశంలో పార్టీల మాదిరిగానే మీడియా సైతం విడిపోయిందని... తమకు అనుకూలంగా ఉంటూ తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేసేవారికే మీడియా సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయని సర్వత్రా అన్నివర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos