కాంగ్రెస్‌తో విలీనం చర్చలు బెడిసికొట్టడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కాంగ్రెస్ మార్క్ రాజకీయం అర్థమవడంతో ... ఆ పార్టీతో విలీనానికి బ్రేక్ చెప్పారని ... సొంతంగానే... ఒంటరిగానే పోటీకి సిద్ధమయ్యారని తెలుస్తోంది. షర్మిల తెలంగాణలో ... పార్టీ అయితే ప్రారంభించారు కానీ... పార్టీ నిర్మాణంలో సక్సెస్ కాలేకపోయారు. పూర్తిగా అట్టడుగు స్థాయి వరకు పార్టీని విస్తరించలేకపోయారు. ఎన్నికలకు గడువు తక్కువగా ఉండటంతో .. పార్టీ విస్తరణ సాధ్యం కాదని భావించి... ఆమె... ఆ మధ్యకాలంలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు.

పార్టీని విలీనం చేస్తే తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిలకు తగిన గుర్తింపు ఇస్తామని.. పాలేరు సీటు కేటాయిస్తామని.. అనుచరులకు ప్రాధాన్యత ఇస్తామనే అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. అయితే షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తామన్న పార్టీ నిర్ణయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సహా మరికొందరు వ్యతిరేకించారు. షర్మిలను ఏపీకి పరిమితం చేయాలని సూచన చేశారు.
తాను తెలంగాణలోనే పని చేస్తానని షర్మిల భీష్మించుకుని కూర్చోవడంతో పాటు సోనియా, రాహుల్ తోనూ ఈ విషయంపై చర్చలు జరిపారు. కానీ... ఆమె ప్రయత్నం ఫలించలేదు. షర్మిల డిమాండ్లను కాంగ్రెస్ అధినేతలు అంగీకరించలేదు. ఫైనల్ గా రాజ్యసభ సీటు ఇస్తామని ... అదీ కాదంటే సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం ఇస్తామని చెప్పారు. షర్మిల తనకు పాలేరు సీటు ఇవ్వాలని పట్టుబట్టగా.. అందుకు కాంగ్రెస్ నాయకత్వం నో చెప్పింది. షర్మిల అనుచర వర్గానికి సంబంధించి ఎటువంటి హామీ దక్కలేదు. విలీనానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సెప్టెంబర్ 30 వరకు .... కాంగ్రెస్‌ నేతలకు షర్మిల డెడ్‌లైన్ విధించారు. కానీ కాంగ్రెస్ నేతలు దానిపై స్పందించలేదు. దీంతో తరువాత షర్మిల ఢిల్లీలోనే మకాం వేశారు. అయినా కాంగ్రెస్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో... ఇక కాంగ్రెస్ తో విలీనం ప్రక్రియకు షర్మిల బ్రేక్ చెప్పారని తెలుస్తోంది. ఈ క్రమంలో... ఇక తొలి నుంచీ చెబుతున్నట్లుగానే ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించాలని షర్మిల యోచిస్తున్నట్టు ఆ పార్టీ సన్నిహిత వర్గాల సమాచారం. త్వరలో దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కానుండటంతో ఈ విషయాన్ని షర్మిల అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే... చిట్టచివరి సారిగా కాంగ్రెస్ మూడ్ మారుతుందేమోననే ఆశతో... ఆమె... మరో ఒకటి రెండ్రోజులు వేచి చూడాలని కూడా భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాతే షర్మిల తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos