తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం వాస్తవ రూపం దాల్చే సమయం ఆసన్నమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షర్మిల ఆకస్మికంగా ఢిల్లీలో ... కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలుసుకుని పలు అంశాలపై చర్చించారని సమాచారం. అనంతరం ఆమె మాట్లాడుతూ మా మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ... తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్సార్ బిడ్డ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుందని ... ముఖ్యమంత్రి కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేసేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చల్లో కాస్త పురోగతి వచ్చినా ఓ అంశంలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్టీపీ విలీనం తర్వాత ఏపీకి వెళ్లి పార్టీ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ ఆమెకు ఆఫర్ చేస్తుండగా.. షర్మిల మాత్రం తెలంగాణలో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టి.కాంగ్రెస్ నేతలు ఆమె చేరికకు అడ్డుచెబుతున్నారని తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. ఈ తరుణంలో వైఎస్ షర్మిల చేరిక తమకు ఇబ్బందిగా మారుతుందని టి.కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణ నుంచే తాను రాజకీయం మొదలుపెట్టాను కాబట్టి ఇక్కడే కొనసాగుతానని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంపై ఎటూ తేల్చుకోలేక గతంలో చర్చలు వాయిదా వేసింది. ఇప్పుడు తాజాగా షర్మిల, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య తాజాగా జరిగిన చర్చల నేపథ్యంలో కాంగ్రెస్ లో షర్మిల చేరిక ఇక లాంఛనమే అని చెప్పుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఆమెకు ఎలాంటి బాధ్యతను అప్పచెబుతారో... ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos