ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ లాబీలో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో ఒక్క ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారని అనుకుంటున్న తరుణంలో ... తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు పంపించింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 16, 20, 21వ తేదీల్లో ఆమెను ఈడీ ప్రశ్నించింది. ఆ సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ తరువాత ఆరునెలల తరువాత సెప్టెంబర్ లో మళ్లీ ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మూడుసార్లు హాజరైనప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రేపటి పరిస్థితి కూడా ఎలా ఉండబోతోందో చూడాలి. మరి కవిత ఈడీ విచారణకు హాజరవుతుందా.. ఏదైనా కారణాలతో వాయిదా కోరుతుందా అనే సందేహాలు వెలువడుతున్నాయి. నిన్న కవితకు బినామీగా వ్యవహరించిన రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారిన క్రమంలో... వెంటనే ఇప్పుడు కవితకు ఈడీ నోటీసులు రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ స్కాం కేసులో ఇప్పటివరకు శరత్ చంద్రారెడ్డి, మా గుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరా, రామచంద్ర పిల్లి, బుచ్చిబాబులు అప్రూవర్లుగా మారిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఇకపై కవితను విచారించరేమో అనుకున్న ఊహాగానాలకు తెరదించుతూ ఈడీ నోటీసులు రావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈడీ నోటీసులపై కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటికాదు అని చెప్పడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందేమోననే అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వచ్చిన తరువాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. దాన్ని మళ్లీ పెంచుకునే క్రమంలోనే ఇది జరిగిందని ... ఈ స్కాం విషయంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos