కర్ణాటకలో ముఖ్యమంత్రి  మార్పు అంశంపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యంలో నవంబర్‌ చివరి నాటికి సీఎం మార్పు ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సిద్ధరామయ్య.. అక్కడ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యేందుకు సమయం కోరగా అందుకు అధిష్ఠానం నిరాకరించినట్లు తెలిసింది.

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో మార్పులు-చేర్పులు చేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇందుకోసం హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ 15 వరకు కర్ణాటక నేతలెవరికీ అపాయింట్‌మెంట్ ఇచ్చేది లేదని అధిష్టానం పెద్దలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇది అందరికీ వర్తిస్తుందని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సిద్ధరామయ్య వర్గంలోని ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్‌.. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. తన సోదరుడు, కొప్పల్‌ ఎంపీ రాజశేఖర్‌ హిట్నాల్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశం బలప్రదర్శన కోసం ఏర్పాటు చేసిందిగా ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు డీకే.శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీ చేరుకున్నారు. ఏడు రోజుల్లోనే ఇది రెండో పర్యటన. అంటే ఢిల్లీ వేదికగా ఏదో జరగబోతుందన్న పుకార్లు వినిపిస్తున్నాయి.  'ఓట్‌ చోరీ' విషయమై ఆయన రాజధానిలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos