న్యూస్ : ప్రముఖ మార్క్సిస్టు నేత, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి ప్రగఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు కూనంనేని తెలిపారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. ఆయన ఉన్నతమైన విద్యావంతుడు, గొప్ప మేధావి అని ఆయన గుర్తుచేశారు. ఢల్లీిలోని జెఎన్‌యులో చదువుకున్నారని, ఆనాటి నుంచి పూర్తికాలం ఢల్లీిలో ఉన్నారని అన్నారు. సిపిఐ(ఎం) పార్టీ, కమ్యూనిస్టుపార్టీల ఉద్యమానికి గొప్ప సేవలందించారని తెలిపారు. ఆయన చనిపోవడం వలన సిపిఎంకే కాదు కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టమని అన్నారు. ప్రజాసమస్యలు, దేశ సమస్యలను ప్రస్తావన చేసే ఒక గొంతు మూగబోయిందని అన్నారు. ఆయన పార్లమెంట్‌లో సైతం గొప్పగా రాణించారని, సిపిఐతో సత్సంబంధాలు కొనసాగించారని కూనంనేని తెలిపారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos