న్యూస్ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి కి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈటి నరసింహ మాట్లాడుతూ సీతారామయ్య ఏచూరి చదువుకునే రోజులలో విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని అత్యంత ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో మూడు సార్లు అధ్యక్షులుగా గెలవడం జరిగింది. అనంతరం cpim చేరి అంచెలంచెలుగా ఎదిగి పార్టీ కి ప్రధాన కార్యదర్శిగా అయ్యారు. ఒక మేధావిగా, అంతర్జాతీయ సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి గా గుర్తింపు పొందారు. దేశంలో ఉన్నటువంటి పాలకవర్గాలు అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాల పైన తన రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేశాడని తెలిపారు. దేశంలో మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీ ముందుకు రావాలని కోరుకున్నారు. వీరి మరణం వామపక్ష ,ప్రగతిశీల శక్తులకు బాధాకరమని చెప్పారు. ఏచూరి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీతారాం ఏచూరి మరణం కార్మిక ఉద్యమానికి నష్టం. సీతారామ్ ఏచూరి కార్మిక, కర్షక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఐదు దశాబ్దాల పాటు ప్రజా పోరాటాలలో ముందు వరుసలో నిలిచిన వ్యక్తి అని తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos