న్యూస్ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందడం పట్ల మాజీ ఎం.పీ. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారం ఏచూరి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. నాలుగు దశాబ్దాల కాలం నుంచి సీతారాంతో వ్యక్తిగత పరిచయం ఉందని, గత ఏడాది వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో సీథారాంతో కలిసి పాల్గొన్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి పలుమార్లు సేతారాంతో భేటీ అయినట్లు వినోద్ కుమార్ తెలిపారు. సీతారం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని, సీతారం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని వినోద్ కుమార్ అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos