రాబోయే 6 నుండి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగం పూర్తిగా మారిపోతుందని, ప్రస్తుతం మనం చూస్తున్న కోడింగ్ పద్ధతులు దాదాపు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ప్రకటించారు. ఇప్పుడు సాఫ్ట్ వేర్ కోడింగ్ ... ఏఐ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. AI మోడల్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే, మనుషులు నెలల తరబడి చేసే కోడింగ్ పనులను ఇవి కేవలం నిమిషాల్లో పూర్తి చేయగల సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ ఆంత్రోపిక్ ఆ పనులు చేస్తోంది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌కు ముప్పు పొంచి ఉందనడానికి ప్రధాన కారణం ఆంత్రోపిక్ AI మోడల్స్ కోడింగ్‌లో చూపిస్తున్న అసాధారణ నైపుణ్యం. గతంలో AI కేవలం చిన్న చిన్న కోడ్ స్నిప్పెట్స్ మాత్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్‌ను నిర్మించడం, బగ్స్‌ను గుర్తించి సరిచేయడం , ఒక ప్రోగ్రామింగ్ భాష నుండి మరొక భాషలోకి కోడ్‌ను మార్చడం వంటి పనులను ఇవి అత్యంత ఖచ్చితత్వంతో చేస్తున్నాయి. దీనివల్ల ప్రాథమిక స్థాయి కోడర్ల అవసరం గణనీయంగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. అయితే సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తిగా అంతరించిపోతుందని అర్థం కాదని.. దాని రూపం మారుతుందని దిగ్గజ కంపెనీల నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంజనీర్లు కోడ్ రాయడం కంటే, AI రూపొందించిన కోడ్‌ను రివ్యూ చేయడం, సమస్యలను విశ్లేషించడం , ప్రాజెక్ట్ డిజైన్‌పై దృష్టి పెట్టడం వంటి పనులకే పరిమితం కావచ్చు. అంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్థానంలో ఒక AI ఆర్కెస్ట్రేటర్ లేదా ప్రాంప్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు క్రియేటయ్యే అవకాశం ఉంది. కేవలం సింటాక్స్ నేర్చుకున్న కోడర్ల కంటే, లాజికల్ థింకింగ్ ఉన్నవారికి మాత్రమే డిమాండ్ ఉంటుంది.

ఈ మార్పు వల్ల కంపెనీలకు ఖర్చులు తగ్గి, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వేగం విపరీతంగా పెరుగుతుంది. ఒకప్పుడు ఒక యాప్ తయారు చేయడానికి 10 మంది ఇంజనీర్లు అవసరమైతే, భవిష్యత్తులో ఒక్క ఇంజనీర్ AI సహాయంతో అదే పనిని పూర్తి చేయగలడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగం ఒక భారీ పరిణామ క్రమంలో ఉంది. ఆంత్రోపిక్ సీఈఓ చెప్పినట్లు 12 నెలల్లోనే అంతా మారిపోతుందా అనేది చర్చనీయాంశమే అయినా, మార్పు మాత్రం అనివార్యం. రాబోయే కాలంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కేవలం టూల్ యూజర్స్ లా కాకుండా, AIని సమర్థవంతంగా వాడుకోగలిగే డొమైన్ ఎక్స్‌పర్ట్స్ గా తమను తాము మలచుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos