తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ... రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎటువైపు జంప్ అవుతారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో అనూహ్యంగా... అత్యధిక మెజారిటీతో గెలిచిన ఊపుతో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామనే జోష్ మీద ఉన్న కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ కు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారశైలి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆయన కారు ఎక్కెందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డి గత కొంతకాలంగా గులాబీ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో చేరి సంగారెడ్డి నుంచే పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన చేరికకు డేట్‌ కూడా ఫిక్స్ అయిందని సమాచారం. చాలాకాలంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగ్గారెడ్డి... గులాబీ నేతలతో చాలా సఖ్యతగా ఉంటున్నారని సమాచారం. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సొంత పార్టీ నేతలతో కంటే అధికార పార్టీ నేతలతోనే ఆయన ఎక్కువ గడిపినట్టు సహచరులు చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగ్గారెడ్డి అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. చాలా సందర్భాల్లో నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అధినాయకత్వానికి కూడా ఫిర్యాదులు చేశారు. అయినా... అధినాయకత్వం మాత్రం రేవంత్‌కే సపోర్ట్ చేస్తుందని జగ్గారెడ్డి అంటున్నారు. అందుకే ఆయన ఈ మధ్య కాలంలో పార్టీలో యాక్టివ్‌గా ఉండటం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి ఈ నెల 19 లేదా 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. కాగా... పార్టీ మార్పుపై జగ్గారెడ్డి ఇంకా స్పందించలేదు. ఈ వార్తలను ఖండించకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos