దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో జరగాల్సిన లోక్ సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా లేక ముందస్తుగా జరుగుతాయా అనే అంశంపై  ఇప్పుడు సాధారణ ప్రజల్లోనే కాకుండా మేధావి వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ... హస్తినపైనే కేంద్రీకృతమైంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం ... నిన్నమొన్నటి దాకా అజెండాపై క్లారిటీ ఇవ్వకపోవడంతో... ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలో కేంద్రం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన అజెండాను విడుదల చేసింది. ఈ సమావేశాల్లో తొలిరోజు 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంపై చర్చించనున్నట్లు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లులపై చర్చ జరగనుంది. రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వొకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చి ... గత నెల 10న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. నియామక ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్‌ చేసిన కేంద్ర కేబినెట్‌ మంత్రి ఒకరు... ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ నుంచి సీజేఐను తొలగించింది. దీంతో ఈ నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది. ఈ బిల్లుతో పాటు నాలుగు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టి... ఆమోదించనుంది. ద అడ్వొకేట్స్‌ బిల్లు, ద ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లుల గురించి చర్చిస్తారని సమాచారం. యూసీసీ బిల్లుపై మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా... ఈ ప్రత్యేక సమావేశాల్లో దేశ ఆర్థిక పరిస్థితి, కుల గణన, చైనా, అదానీ గ్రూప్‌తో పాటు సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై కూడా చర్చించాలని సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos