జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉన్న పహల్గాంలో 26 మంది భారతీయ పౌరులపై తీవ్రవాదులు కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్న ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ తో అన్ని బంధాల్ని పూర్తిగా తెంచేసుకోవడంతో పాటు ఇరుదేశాల సరిహద్దులు మూసేయడం, మన దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరుల్ని బహిష్కరించడం వంటి చర్యలున్నాయి. ఇదే క్రమంలో హోంమంత్రి రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తమ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న పాకిస్తాన్ పౌరుల్ని గుర్తించి తక్షణం వెనక్కి పంపేయాలని ఈ ఆదేశాల్లో అమిత్ షా పేర్కొన్నారు. దీంతో పాక్ పౌరుల గుర్తింపు ప్రారంభమైంది. తమ అధికార పరిధిలో నివసిస్తున్న  పాకిస్తాన్ జాతీయులందరినీ గుర్తించి వారిని బహిష్కరించాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. హోంమంత్రి అమిత్ షా అన్ని ముఖ్యమంత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారని కూడా హోంశాఖ తెలిపింది.

 జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఐదు దశల దౌత్యపరమైన ప్రతిఘటనలో భాగంగా పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేసినట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి అమలులోకి వచ్చేలా అన్ని వీసాలను రద్దు చేస్తామని తెలిపింది. వైద్య వీసాలు మాత్రం అదనంగా మరో 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కేంద్రం ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే, హిందూ పాకిస్తాన్ జాతీయులకు దీర్ఘకాలిక వీసాలు చెల్లుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos