రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఎవ్వరు ... ఎప్పుడు ... ఏం మాట్లాడినా... ఆ మాటలు సెన్సేషన్ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ ఆ విధంగానే ప్రస్తుతం సంచలనంగా మారాయి. సాధారణంగా రజినీకాంత్ ... అటు సినిమాల్లో... ఇటు రాజకీయపరంగానూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు. ఆయన అభిమానుల జాబితాలో ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు.
తాజాగా జైలర్ ఆడియో విడుదల వేడుక సందర్భంగా ... రజనీ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఏపీలో ఎవరో చేసిన కామెంట్స్ కు ఇప్పుడు ఆయన గట్టి కౌంటర్లు గా ఇవి కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఈ మాటలు ఆయన అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. భాషతో సంబంధం లేకుండా ఆయన మాట్లాడిన మాటలు, పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  రజనీకాంత్ ఆ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై మాత్రం రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
రజనీకాంత్ ప్రసంగం చివరిలో ‘అర్ధమైందా రాజా’ అని చెప్పడం ద్వారా ఇటీవల ఆయనపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారా... అనే చర్చ కూడా సాగుతోంది. ఇంతకీ రజనీకాంత్ ఏమన్నారంటే.. ‘మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ ఉండని ఊరే లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి’ అని తమిళంలో చెప్పారు. చివరిలో తెలుగులో ‘అర్థమైందా రాజా’ అని అనడంతో... ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది.
ఈ వేడుకకు హాజరైన ప్రముఖులు, సాధారణ అభిమానులు ... ఇలా అందరూ నవ్వుతూ కనిపించారు.  కొన్నినెలల కిందట విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సందర్భంగా రజనీకాంత్ ప్రసంగిస్తూ...  ఎన్టీఆర్ గొప్పతనం, ఆయనతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే చంద్రబాబును రజనీకాంత్ ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు ... ఆయపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌పై ఓ రేంజ్‌లో ఎదురుదాడికి దిగారు.
ప్రస్తుతం మంత్రిగా ఉన్న సినీ నటి  రోజా కూడా ఘాటుగానే స్పందించారు. కొడాలి నాని అయితే.. రజనీకాంత్‌పై తనదైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడారు.  తాజాగా రజనీకాంత్ తన మాటల ద్వారా వైసీపీ నేతలకే కౌంటర్ ఇచ్చారని పలువురు తెలుగు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను తెలుగు రాష్ట్రాల్లోని రజనీకాంత్ అభిమానులు, టీడీపీ, జనసేన మద్దతుదారులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం విజయ్ ఫ్యాన్స్ గురించే ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. రజనీ ఎవరిని కామెంట్ చేశారన్న దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos