ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ గబ్బా టెస్టు ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 38 ఏళ్ల అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు పడగొట్టాడు. అలాగే, టెస్టు క్రికెట్‌లో 6 సెంచరీల సాయంతో 3503 పరుగులు చేశాడు. టెస్టు కెరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. అతను 106 టెస్టుల్లో 24 యావరేజ్‌లో 537 వికెట్లు తీసుకున్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానంలో ఉన్నాడతను. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు భారత టెస్టు చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడిగా పేరుగాంచాడు. ఈ టూర్‌లో అతనికి ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. అడిలైడ్ తర్వాత, అతను గబ్బా టెస్టుకు దూరమయ్యాడు. గబ్బా టెస్టు సందర్భంగా అశ్విన్ టీమిండియా ఆటగాళ్లను కౌగిలించుకుంటూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. అశ్విన్ కూడా హెడ్ కోచ్ గంభీర్‌తో చాలాసేపు మాట్లాడి, ఆపై విలేకరుల సమావేశానికి వచ్చి రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడవ టెస్టు చివరి రోజు అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
క్రికెట్ ఆల్‌రౌండర్లలో అశ్విన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. మూడు వేల రన్స్, 300 వికెట్లు తీసిన 11 ఆల్‌రౌండర్ల లిస్టులో అతను ఉన్నాడు. రికార్డు స్థాయిలో అశ్విన్ 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. మేటి స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో సమానంగా నిలిచాడు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos