దేవుళ్లలో అందమైన దేవుళ్లు... దేవతలు ఉంటారని అందరూ అనుకోవడం సాధారణం. కానీ రాక్షసుల్లో కూడా అందాల రాక్షసులు ఉంటారని తెలియదు కదూ. అలాంటి అందమైన రాక్షసిని చూడాలన్నా... తెలుసుకోవాలనుకున్నా కచ్చితంగా ఆదిపురుష్ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ... అందులో రాక్షసి శూర్పణఖ పాత్రలో మెరిసిన అందాల భామను చూసి.. ఔరా... ఈ రాక్షసి ఎంత అందంగా ఉందో అని నోరెళ్లబెడతారు. ఇంతకీ ఆ పాత్రలో మెరిసిన ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరనేగా మీ సందేహం. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.

 

ఈ సినిమాలో ప్రధానపాత్రల్లో మెరుపులు కురిపించిన ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ అందరికీ తెలిసిన వారే. ఇతర పాత్రల గురించి చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. అందాల రాక్షసిగా అలరించిన శూర్పణఖ పాత్రధారిణి గురించి కూడా చాలామందికి తెలియదు. రావణాసురుడి చెల్లిగా శూర్పణఖ పాత్రలో నటించిన నటి పేరు తేజస్విని పండిట్. ఆమె నటన, అందం అభినయానికి ఆడియన్స్ ముగ్ధులైపోయారు. రాక్షసి పాత్రలోనూ అందాల రాక్షసిగా ఆకట్టుకుంది. దీంతో చాలామంది నెటిజన్లు తేజస్విని పండిట్ గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. మరాఠి నటి అయిన తేజస్విని పండిట్‌ ... హీరోయిన్ మెటీరియలే అయినప్పటికీ సరైన అవకాశాలు దక్కలేదనే చెప్పుకోవాలి.

తేజస్విని పండిట్ 2004లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ సరైన స్టార్‌డమ్ మాత్రం దక్కలేదు. 2004లో వచ్చిన ‘అగా బాయి అరేచా’ అనే మరాఠి సినిమాతో తేజస్విని తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. అందులో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న కథానాయిక పాత్రలో నటించింది. అలాగే ‘రన్ బజార్’ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా నటించింది. ఆ తర్వాత కూడా పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది. మరాఠిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది.

గ్లామరస్ పాత్రల్లోనూ ఆకట్టుకుంది. పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా దక్కాయి. అయితే తేజస్విని పండిట్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘‘ఆదిపురుష్’’ మూవీ కావడం గమనార్హం. తేజస్విని పండిట్ కేవలం వెండితెరపైనే కాదు బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఉత్తమ నటిగా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకుంది. తేజస్విని తన వ్యక్తిగత జీవితంలో  కూడా చాలా డిస్ ప్లీన్ ను.. గ్లామర్ ను పక్కాగా మెయింటెయిన్ చేస్తుంటుందని చెబుతారు. తన చిన్ననాటి స్నేహితుడైనా భూషణ్ బోప్చేను 2012లో వివాహం చేసుకుంది.

అయితే ఈ వివాహం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఆ తర్వాత కొంతకాలానికే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. కాగా తేజస్విని పండిట్‌కు సోషల్ మీడియాలో ఒక మిలియన్‌కు పైగానే ఫాలోవర్లు ఉండడం విశేషం. మొత్తానికి రాక్షసి పాత్రలో నటించినా... ... శూర్పణఖకు అందాల రాక్షసిగా ఇమేజ్ తెచ్చిపెట్టిన తేజస్విని పండిట్ రియల్లీ గ్రేట్ కదూ. తేజస్విని ... సినిమాల్లో మున్ముందు మరింతగా పేరు తెచ్చుకోవాలని బెస్టాఫ్ లక్ చెబుదామా మరి.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos