నదిని దాటడం కోసం నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది. ఆ సమయంలో దాని మీద ప్రయాణం చేస్తున్న వాహనాలు ఒక్కసారిగా నదిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు నీటిలో పడిపోగా.. ముగ్గురు మృతి చెందారు. మరి కొందరు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ ప్రమాదం గుజరాత్‌లో వెలుగు చూసింది. గుజరాత్ లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కొంత భాగం బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జి కూలిన సమయంలో దాని మీద పదుల సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి. వంతెన కూలడంతో అవి నదిలోకి పడిపోయాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గుజరాత్‌లోని ఆనంద్ పట్టణం - వడోదరలను కలుపుతూ.. పద్రా వద్ద మహిసాగర్ నదిపై గంభీర వంతెన నిర్మించారు. బుధవారం ఒక్కసారిగా దీనిలో కొంత భాగం కుప్పకూలడంతో.. అదే సమయంలో దాని మీద నుంచి వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లతో పాటుగా మరి కొన్ని వెహికల్స్ నదిలోకి పడిపోయాయి. ఈఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని నదిలో ఉన్న వారిని రక్షించే పని ప్రారంభించాయి. నదిలో పడిపోయిన వాహనాల నుంచి ఇప్పటివరకు నలుగురిని రక్షించారని.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. గంభీర వంతెన కూలిపోవడంతో.. ఆనంద్ పట్టణం - వడోదరల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందగా.. మరి కొందరి ఆచూకీ లభించడం లేదు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos