ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అటు పాకిస్థాన్ సేనలు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతుండగా... భారత్ ఆర్మీ వీటిని ధీటుగా తిప్పి కొడుతోంది. పారా మిలిటరీ సిబ్బంది సెలవులను కేంద్రం రద్దు చేసింది. భారత్ లో పాకిస్థాన్ దాడులకు దిగే అవకాశం ఉందని విదేశాంగ అధికారులు వెల్లడించారు. దీంతో.. త్రివిధ దళాలు సమాయత్తం అయ్యాయి. ఏ పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే పూర్తి సంసిద్దత తరువాతనే భారత్ తాజాగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇక, కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ సహచర మంత్రులకు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు.

కేబినెట్ భేటీ తరువాత ప్రధాని నేరుగా రాష్ట్రపతి వద్దకు వెళ్లారు. ఆపరేషన్ సింధూర్ తో పాటుగా సరిహద్దుల్లో నెలకొన్ని పరిస్థితులను వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న స్పందన గురించి రాష్ట్రపతికి నివేదించారు. ప్రధాని విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్,  బంగ్లాదేశ్, నేపాల్ తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. డీజీపీలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. పాకిస్థాన్ నుంచి ఎటు వంటి ప్రతిస్పందన వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని చెబుతూనే.. రాష్ట్రాలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించనున్నారు.

ఇవాళ సాయంత్రం దేశ వ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. రేపు గురువారం కేంద్రం అఖిలపక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనుంది. ఆర్మీ ఆకస్మిక దాడుల తరువాత చోటు చేసుకున్న పరిణామాలను వివరించనుంది. ఏ క్షణం అయినా ఎలాంటి ప్రతిఘటన పాక్ నుంచి వచ్చినా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్దంగా ఉన్నాయి. దీంతో, రానున్న 48 గంటలు ఉత్కంఠ పెంచే అవకాశం కనిపిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos