తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ... అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి... కేవలం నలుగురు స్థానాల్లో మాత్రం ప్రకటించకుండా సస్పెన్షన్ లో ఉంచింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకత్వం త్వరలోనే ఆ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. ఈ జాబితాలో  30 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. కేంద్రమంత్రి  అమిత్ షాతో  ఇటీవల మరో కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి భేటీ అయి తొలిజాబితా విడుదలపై చర్చించారు.

ఇక .. ఏ క్షణమైనా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే  అవకాశం ఉందనే  ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అమిత్ షాతో  కిషన్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెల సెప్టెంబర్ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు పేర్లు వెల్లడించిన ఆశావాహుల నుండి బీజేపీ నాయకత్వం ధరఖాస్తులను స్వీకరించింది. ఈ నెల  రెండో వారంలో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే  అవకాశం ఉందనే ప్రచారం సాగుతుండటంతో బీజేపీ కూడా అతి త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఆ పార్టీ నాయకత్వం  ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ  అభ్యర్థుల జాబితాలను విడుదల చేయనుంది. మోస్ట్ ప్రాబబ్లీ... వచ్చేవారంలో 30మందితో అభ్యర్థుల జాబితాను బీజేపీ  ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ ప్రకటించే తొలి జాబితాలో  సీనియర్ల పేర్లు ఉండే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఆ పార్టీ నేత  సునీల్ భన్సల్ క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా  బలోపేతం చేసే విషయమై వ్యూహరచన చేస్తున్నారు. ఎలాంటి వివాదం లేని ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న అసెంబ్లీ స్థానాల జాబితాను తొలుత బీజేపీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వారినే కాకుండా పార్టీ కీలక నేతలను ఈ దఫా అసెంబ్లీ బరిలోకి దింపనుంది.

ఈ క్రమంలో తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఫోకస్ పెట్టింది. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో బీజేపీపై కేంద్ర నాయకత్వం తెలంగాణపై  ఫోకస్ ను పెంచింది. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను పార్టీలో చేరేలా ప్రోత్సహించింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  బీజేపీలో చేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో నేతల చేరికలపై  కిరణ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరింత మంది ప్రముఖ నేతలకు గాలం వేసే విధంగా నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos