తెలంగాణలో ఈసారి జరగబోయే ఎన్నికలు అన్నిపార్టీలకు ఎంతో ముఖ్యమైనవే అయినా... బీఆర్ఎస్ కు మాత్రం ముఖ్యమైనవే కాకుండా ప్రతిష్టాత్మకం కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడో అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ఇవి. రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 119. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 63 స్థానాల్లో గెలుపొంది కేసీఆర్ నాయకత్వంలోని అప్పటి టీఆర్ఎస్ పార్టీ కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా... సీఎం కేసీఆర్ ముందస్తు  ఎన్నికలకు వెళ్లారు. దీంతో 2018లో ఎన్నికలు జరిగాయి. 2018 ఎన్నికల్లో మొదటిసారి కంటే 25 సీట్లు ఎక్కువగా గెలుచుకుని 88 సీట్లతో గులాబీ పార్టీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది. రాష్ట్రంలో విపక్షపార్టీలు కూటమిగా ఏర్పడిగా బీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేకపోయాయి. ఆ తర్వాత. టీఆర్‌ఎస్‌ కాస్త బీఆర్‌ఎస్‌గా మారింది. పేరు మార్పు తర్వాత తొలిసారిగా ఎన్నికలు ఎదుర్కోబోతోంది.

కాగా... 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో 119 సీట్లకుగాను 63 సీట్ల గెలుచుకున్న టీఆర్‌ఎస్‌... 34.04 శాతం ఓట్ల షేర్ సాధించింది. కాంగ్రెస్‌ పార్టీ 21 స్థానాలకే పరిమితం కాగా... టీడీపీ 15, ఎంఐఎం 7, బీజేపీ 5, వైసీపీ 3, బీఎస్పీ 2, సీపీఐ, సీపీఎం చెరొక స్థానం, ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నాయి.
అదేవిధంగా 2018 ఎన్నికల్లో 88 సీట్లు గెలిచి విజయదుందుభి మోగించింది టీఆర్‌ఎస్‌. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 సీట్లు, ఎంఐఎం ఏడు, టీడీపీ రెండు, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్లు ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు.  గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ మొదటిస్థానంలో ఉండగా.. కాంగ్రెస్‌ రెండో స్థానంలో కొనసాగింది. 2014లో నాలుగో స్థానంలో ఉన్న ఎంఐఎం ... 2018లో మూడోస్థానానికి చేరింది. టీడీపీ మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక బీజేపీ.. 2014లో ఐదో స్థానంలో ఉంది.. కానీ 2018లో ఆరో స్థానానికి పడింది. ఈమధ్య తెలంగాణలో బీజేపీ రెండో స్థానంలోకి వచ్చేసింది అనుకునేలోపే... కమలం పార్టీ గ్రాఫ్‌ పడిపోయిందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ... రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ముఖచిత్రం ఎలా మారబోతుందో చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos