ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక ముందే అప్పుడే ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ 15 లేదా 20 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలను ఆకర్షించే విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన మహిళకు నెలకు రూ.2100 ఇచ్చే ప్రతిపాదనకు గురువారం ఉదయమే సీఎం అతిషి సారథ్యంలోని ఢిల్లీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఇందుకోసం అర్హులైన మహిళల ఎంపికకు రేపు శుక్రవారం నుంచే దరఖాస్తులను స్వీకరించనున్నామని ప్రభుత్వం తెలిపింది. త్వరలో ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నందున.. ఇప్పటికిప్పుడు పథకం అమలు సాధ్యం కాదని ఆమ్ ఆత్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించి ఎన్నికల తర్వాత మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తాను మహిళలకు ప్రతినెలా రూ.1000 ఇస్తానని ఇప్పటికే ప్రకటించానని, అయితే చాలామంది మహిళలు రూ.1000 సరిపోవడం లేదని చెప్పినందువల్ల ఆ మొత్తాన్నిరూ.2100 పెంచినట్లు కేజ్రీవాల్  పేర్కొన్నారు. అటు ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల వరకు జీవిత బీమా, రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తామని ఇటీవలే కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని,ఆటోవాలాలకు యూనిఫాం అలవెన్స్ కింద ఏడాదికి రెండుసార్లు రూ.2,500 చొప్పున నిధులు ఇస్తామని కూడా కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల ముందు అక్కడి ప్రభుత్వం మహిళలకు నెలకు కొంత మొత్తాన్ని ఇచ్చే పథకాన్ని అమలు చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార కూటమి మళ్లీ విజయం సాధించిన విషయాన్ని ఇక్కడ రాజకీయ విశ్లేషకులు గుర్తుకు తెస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించినట్లుగా...  ఢిల్లీలో కేజ్రీవాల్ విజయం సాధిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos