ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలో విచారణ చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం .. వర్గీకరణ తప్పనిసరి అని పేర్కొంది. ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించడంతో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దీంతో దేశవ్యాప్తంగా ఎస్సీ కులస్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు విచారణ సాగిన విషయం తెలిసిందే. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. సుదీర్ఘ వాదనలు అనంతరం ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.

ఎస్సీ వర్గీక‌ర‌ణ అంశం ఎన్నో సంవ‌త్స‌రాలుగా పెండింగ్ లో ఉంది. దీనిపై ఎన్నో పోరాటాలు జ‌రిగాయి. కొంత మంది వ్య‌తిరేకిస్తే, ఇంకొంద‌రు స‌మ‌ర్థించారు. ఎస్సీల్లో ఉన్న ఉప కులాల ఆధారంగా రిజ‌ర్వేష‌న్లు కావాలంటూ జ‌రుగుతున్న ఉద్య‌మం మొత్తానికి తుది అంకానికి చేరింది. విద్యా, ఉద్యోగ‌-ఉపాధి అంశాల్లో ఎస్సీ, ఎస్టీల్లో ఉప కులాల ఆధారంగా వ‌ర్గీక‌రిస్తూ, అందుకు అనుగుణంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న డిమాండ్ కు సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఏడుగురు న్యాయ‌మూర్తుల విస్తృత ధ‌ర్మాస‌నంలో జ‌స్టిస్ బేలా త్రివేది మిన‌హా మిగిలిన ఆరుగురు అనుకూలంగా తీర్పునిచ్చారు. 2004 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఉప కులాల ఆధారంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత మాల మ‌హానాడు హైకోర్టుకు వెళ్ల‌టం.. కోర్టు స్టే ఇవ్వ‌టంతో ఉపకులాల ఆధారంగా రిజ‌ర్వేష‌న్ల అంశం ఆగిపోయింది. గ‌తంలోనే సుప్రీంకోర్టు దీనిపై విచారిస్తూ… వ‌ర్గీక‌ర‌ణ‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకోలేవ‌ని, కేంద్రం చ‌ట్టం చేస్తే, రాష్ట్రప‌తి ఉత్త‌ర్వుల త‌ర్వాతే అమ‌ల‌వుతాయ‌ని తీర్పునిచ్చిన నేప‌థ్యంలో ఎస్సీ-ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ ఉద్య‌మాలు కొన‌సాగుతున్నాయి. మంద‌కృష్ణ మాదిగ‌తో పాటు ప‌లువురు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం పోరాడుతూ రాగా… ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ కూడా మ‌ద్ద‌తు ప‌లికింది. ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా వ‌చ్చి వ‌ర్గీక‌ర‌ణ‌కు సానుకూల ప్ర‌క‌ట‌న చేశారు.
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్ర‌కారం… ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న ఉప కులాల ఆధారంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయ‌ని అత్యున్నత న్యాయస్థానం స్ప‌ష్టం చేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos