కేంద్రం పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుల్ని సవాల్ చేస్తూ.. తాజాగా పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు మొహమ్మద్ జావెద్, అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా... ఇవాళ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సుప్రీంకోర్టులో విడిగా ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సంస్థ కూడా సుప్రీంను ఆశ్రయించింది.

కాంగ్రెస్, ఎంఐఎం తర్వాత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మూడో విపక్ష పార్టీగా ఆప్ నిలిచింది. ప్రస్తుతం ఈ వివాదాస్పద చట్టం పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్ట సవరణ ముస్లింల మతపరమైన, సాంస్కృతిక స్వయంప్రతిపత్తిని తగ్గిస్తుందని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం మైనారిటీలు తమ మతపరమైన , స్వచ్ఛంద సంస్థలను నిర్వహించే హక్కులను దెబ్బతీస్తుందని వాదించారు.

ఈ చట్టం సమానత్వ స్వేచ్ఛ, మతపరమైన వ్యవహారాల నిర్వహణ మరియు మైనారిటీల హక్కులతో సహా పౌరుల బహుళ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని ఖాన్ తన పిటిషన్ లో ఆరోపించారు. అయితే కేంద్రం మాత్రం ఈ చట్టం ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారిస్తుందని తెలిపింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ చేపట్టబోతోంది. ఆలోపు రాష్ట్రపతి పార్లమెంట్ ఆమోదించిన బిల్లుల్ని ఆమోదిస్తే ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos