ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు పేలుడు పై ప్రధాని మోదీ స్పందించారు. ఘటన పైన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పేలుడు వెనుక ఉన్న కుట్ర దారులను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఘటన పైన విచారణ జరుగుతోందని.. మూలాలు గుర్తించి కారకులను వెంటాడుతామని ప్రధాని హెచ్చరిం చారు. కుట్ర దారులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేసారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులను గుర్తిస్తామని వెల్లడించారు.

ఈ ఘటన తన గుండెను కలిచి వేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. భూటాన్ పర్యటనలో భాగంగా ప్రధాని ఈ అంశం పైన తొలి సారి స్పందించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. దేశంలోని పలు సంస్థలు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. బాంబు పేలిన ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఈ ఘటనలో ఇప్పటికే.. 9 మంది మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. మరో 17 మందికి LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ పేలుడులో అమోనియం నైట్రేట్‌ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్‌ ఆత్మాహుతి దాడిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

పేలుడు కోసం వినియోగించిన కారు పుల్వామాకు చెందిన డా.ఉమర్‌దిగా గుర్తించారు. కారులో ఉన్నది డా.ఉమర్‌గా ప్రాథమికంగా నిర్ధారించారు. డా.ఉమర్‌ పుల్వామాకు చెందిన వ్యక్తి .. అని.. శ్రీనగర్‌లోని MD మెడిసిన్స్‌ కాలేజీ, GMC అనంతనాగ్‌లో పనిచేసినట్లు పేర్కొంటున్నారు. ఈ పేలుళ్లతో దేశ వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో రాత్రి నుంచే భద్రతను పెంచారు. CISFతోపాటు.. సీఆర్పీఎఫ్‌, లోకల్‌ పోలీసులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు తర్వాత రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. మెయిన్ గేట్ నుంచి ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్ళే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన వెనుక ఉగ్ర మూలాలు ఉన్నాయనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. రేపు జరగనున్న కేంద్ర మంత్రి వర్గ భేటీలో ఈ పేలుళ్ల పైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos