తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... ఆయా పార్టీల్లో హడావుడి పెరిగింది. పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారైన తరువాత కొన్ని పార్టీలు టికెట్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ  - బీఎస్పీ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించే అభ్యర్థుల తొలి  జాబితాను ప్రకటించింది. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఎస్పీ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించినట్టుగా బీఎస్పీ తెలిపింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ప్రవీణ్ పేరు తొలి జాబితా అభ్యర్థులలో ఉంది. ఆయన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ శాసనసభ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. ఇక, బీఎస్పీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే..
మా    సిర్పూర్ (జనరల్)- ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
2. జహీరాబాద్ (ఎస్సీ)- జంగం గోపి
3. పెద్దపల్లి (జనరల్) - దాసరి ఉష
4. తాండూరు (జనరల్)- చంద్రశేఖర్ ముదిరాజ్
5. దేవరకొండ (ఎస్టీ)- ఎం వెంకటేశ్ చౌహాన్
6. చొప్పదండి (ఎస్సీ)- కొంకటి శేఖర్
7. పాలేరు (జనరల్)- అల్లిక వెంకటేశ్వర్ రావు
8. నకిరేకల్ (ఎస్సీ)- మేడి ప్రియదర్శిని
9. వైరా (ఎస్టీ)- బానోతు రాంబాబు నాయక్
10. ధర్మపురి (ఎస్సీ)- నక్క విజయ్ కుమార్
11. వనపత్తి (జనరల్)- నాగమొని చెన్న రాములు ముదిరాజ్
12. మానుకొండూరు (ఎస్సీ)- నిషాని రాంచందర్
13. కోదాడ (జనరల్)- పిలుట్ల శ్రీనివాస్
14. నాగర్‌కర్నూల్ (జనరల్)- కొత్తపల్లి కుమార్
15. ఖానాపూర్ (ఎస్టీ)- బాన్సిలాల్ రాథోడ్
16. అందోల్ (ఎస్సీ)- ముప్పరపు ప్రకాశం
17. సూర్యాపేట (జనరల్)- వట్టే జానయ్య యాదవ్
18. వికారాబాద్ (ఎస్సీ)- గడ్డం క్రాంతి  కుమార్
19. కొత్తగూడెం (జనరల్)- ఎర్ర కామేష్
20. జుక్కల్ (ఎస్సీ)- ప్రధ్య్న కుమార్ మాధవరావ్

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos