తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆయా పార్టీల నేతలు రివ్వున దూసుకుపోతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటన విషయంలోనే ఆపసోపాలు పడుతోంది. అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ జాప్యం కొనసాగిస్తుండడంతో పార్టీలో కన్ఫ్యూజన్ పెరుగుతోంది.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా, ఆరు నియోజకవర్గాలపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఇప్పడిప్పుడే ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్పష్టత వచ్చిన సీట్లపైనయినా అధికారికంగా జాబితాను విడుదల చేయకపోవడంతో శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది.

వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల నుంచి ఒక్కో సెగ్మెంట్ నుంచి ప్రధానంగా ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థులు రేసులో ఉన్నారు. ములుగు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కకు, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణకు టికెట్ పోటీ లేదు. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖకు, వర్ధన్నపేట నుంచి లేఆర్ నాగరాజుకు, పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఝాన్సీరెడ్డికి, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డికి టికెట్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. వీటి సంగతెలా ఉన్నా... ప్రధానంగా డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్ పశ్చిమ, జనగామ, స్టేషన్ ఘన్ పూర్, పరకాలపై అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు ఎలా ఉంటుందనేదే ఆసక్తిగా మారింది. డోర్నకల్ లో రాంచందునాయక్, నెహ్రూనాయక్ మధ్య పోటీ ఉంది. ఇక్కడ భూపాల్ నాయక్ సైతం తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. మహబూబాబాద్ లో బలరాంనాయక్, డాక్టర్ మురళీనాయక్ మధ్య టికెట్ ఫైట్ కొనసాగుతోంది. జనగామలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి, పొన్నాల మధ్య టికెట్ పోరు కొనసాగుతోంది. స్టేషన్ ఘన్ పూర్ లో సింగపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య, బొల్లెపల్లి కృష్ణ ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాలు, చేస్తున్నారు. పరకాల నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రచారంలో ముందంజలో ఉండగా... టికెట్లు ఖరారు కాకుండా ప్రచారాన్ని ఎలా మొదలుపెట్టాలనే సంశయంతో కాంగ్రెస్ ఆశావహులు ఉన్నారు. ప్రచారాన్ని వేగవంతం చేయడానికి ముందుకెళ్లలేక.... వెనక్కి తగ్గలేక సతమతమవుతున్నారు. టికెట్ల విషయంలో వెంటనే నిగ్గు తేల్చాలని వారు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos