తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సినీ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసాలకు బాంబు బెదిరింపులు రావడం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి ఈ నలుగురు ప్రముఖుల ఇళ్లలో బాంబులు పెట్టినట్లు హెచ్చరిస్తూ పోలీసులకు ఓ ఈ-మెయిల్ అందింది. డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు సందేశం ఈ-మెయిల్ రూపంలో వచ్చింది. ఈ సమాచారం అందిన వెంటనే అధికారులు అప్రమత్తమై.. సీఎం స్టాలిన్ నివాసంతో సహా నలుగురు ప్రముఖుల నివాసాల వద్ద భద్రతను వెంటనే కట్టుదిట్టం చేశారు.

పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు కలిసి ఇళ్ల లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలు కొన్ని గంటల పాటు కొనసాగాయి. విస్తృత తనిఖీల అనంతరం, అధికారులు ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులను కనుగొనలేదు. దీంతో ఈ ఈ-మెయిల్ నకిలీ బెదిరింపు అని నిర్ధారించారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ ఈమెయిల్ పంపిన మూలాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

కాగా.. తమిళనాడులో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు రావడం ఇటీవల కాలంలో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది: చెన్నై, ఇంజంబక్కంలోని అజిత్ కుమార్ నివాసానికి కేవలం వారం రోజుల క్రితం కూడా గుర్తుతెలియని వ్యక్తి నుండి ఇదే తరహా బెదిరింపు వచ్చింది.ఇటీవల నటుడు అరుణ్ విజయ్ ఇంటికి కూడా ఈ-మెయిల్ ద్వారా ఇలాంటిదే బాంబు బెదిరింపు వచ్చింది, అది కూడా నకిలీదని తేలింది. గత నెలలో కూడా సీఎం స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. అంతకుముందు బీజేపీ ప్రధాన కార్యాలయం, నటి త్రిష నివాసాలకు కూడా ఇలాంటి నకిలీ హెచ్చరికలు వచ్చాయి. పోలీసులు ఈ వరుస ఫేక్ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos