తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వివరించారు. ఈ మేరకు ఆయన నిన్నరాత్రి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. తిరుమల పవిత్ర క్షేత్రమని, ఇది రాజకీయ వేదిక కాదని హెచ్చరించారు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించామని గుర్తు చేశారు.

ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ విడిపోయిన సమయంలో కూడా తమకు ఇబ్బందులు లేవని.. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేసిన క్రమంలో టీటీడీ ఛైర్మన్ సీరియస్ గా స్పందించారు. తిరుమల పవిత్ర క్షేత్రమని.. ఇది రాజకీయ వేదిక కాదని.. రాజకీయంగా తిరుమలను ఏ ఒక్కరూ వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.

తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనకడుగు వేయకూడదని తమ పాలకమండలి తొలి సమవేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ అన్నారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే అది ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే... ఇటీవల తెలంగాణకు చెందిన నేత తిరుమల వేదికగా రాజ్యకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని,  అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos