జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. అనంత్‌నాగ్‌ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌ లోయలో విహరిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు విచాక్షణరహితంగా దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరి ఆరోగ్యం విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో దాడికి పాల్పడిన వారిని వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని ఇండియా వచ్చేశారు. పలు దేశాల అధ్యక్షులు సైతం ఈ దాడిని ఖండిస్తూ భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా విషాదం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు విష్ణు, మంచు మనోజ్, నాని సహా పలువురు నటులు రియాక్ట్ అయ్యారు.

పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఘటన హృదయ విదారకమైందని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇది క్షమించరాని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మరణించిన వారి కుటుంబాలకు తన హృదయపూర్వ‌క‌ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అలానే పహల్గాం దాడిలో మృతిచెందిన‌ వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నా" అని తార‌క్ రాసుకొచ్చారు. పహల్గాంలో జరిగిన పిరికి దాడి హృదయ విదాకరం. త‌మ‌వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి స‌మ‌యంలో మనం మరింత బలంగా నిలబడాలి. ఈ దుఃఖ స‌మ‌యంలో ఐక్యంగా, స్ఫూర్తితో ఉండాలి. ఉగ్రవాదం మనల్ని ఎప్పటికీ విభజించలేదు. జై హింద్" అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇంకా రాంచరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ తదితర నటులు ... తమ ట్వీట్లలో విచారం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

15-49-17-0617.jpg

మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం.. ఆర్టీజీఎస్ పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
2026-06-22 Time: 03:49:17

15-31-26-0626.jpg

ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు.. 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
2026-06-22 Time: 03:31:26

17-02-16-0616.jpg

అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు
2026-06-20 Time: 05:02:16

14-06-28-0628.jpg

90వ రోజు ప్రజాదర్బార్.. వివిధ సమస్యలపై ప్రజల  వినతుల స్వీకరణ.. అన్నివిధాల అండగా ఉంటానట్టు  మంత్రి లోకేష్ హామీ
2026-06-16 Time: 02:06:28

14-04-35-0635.jpg

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. సింగపూర్‌లో సెమీకండక్టర్లపై సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో సీఎం చంద్రబాబు
2026-06-16 Time: 02:04:35

Related Videos