మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో ఇంకా శిధిలాల కింద పలువురు చిక్కుకున్నారని సమాచారం. ఈ ఘటనలో భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలు పాటించకుండా అక్రమ నిర్మాణం చేశారని ఫలితంగా ఇది కుప్పకూలిందని మహారాష్ట్ర పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిన్న అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
మొత్తం 50 ఫ్లాట్లు ఉన్న రమాబాయి అపార్ మెంట్ లో వెనుక భాగం కుప్పకూలి పోవడంతో ఘోర ప్రమాదం జరిగింది .ఇది పక్కనే ఉన్న మరో భవనంపైన పడింది. మొత్తం 12 నివాసాలు ఉన్న ఒక పక్క భాగం అంతా కూలిపోవడంతో 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 20 నుండి 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు గా భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది అక్రమ నిర్మాణంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భవనం కూలిన సమయంలో నాలుగో అంతస్తులో ఓ చిన్నారి తొలి పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. చిన్నారి పుట్టినరోజు వేడుకలలో బంధువులంతా సంతోషంతో డ్యాన్సులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేక మేడలా భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆ చిన్నారితో పాటు తల్లిదండ్రులు అతిథులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తల్లీ బిడ్డ మరణించినట్టు పోలీసులు ధృవీకరించారు. తండ్రి జాడ ఇంకా తెలియలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos