కోలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోనీ.. తన పెద్ద కుమార్తె మీరా మృతి నేపథ్యంలో మొదటిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చెన్నైలోని వారి నివాసంలో పదహారేళ్ల మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతురు మృతిపై విజయ్ ఎక్స్ వేదికగా భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమార్తెతో పాటు తానూ చనిపోయానని, ఇక నుంచి తాను చేయబోయే ప్రతి మంచి పనిని ఆమె పేరునే చేస్తానని, అప్పుడైనా ఆమె తనతోనే ఉన్నట్లుగా భావన కలుగుతుందని అన్నారు. నా కుమార్తె గొప్ప హృదయం గల మనిషి... అంతకుమించి ధైర్యవంతురాలు... ప్రస్తుతం తను కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణంలేని ప్రశాంతమైన చోటుకి వెళ్లిపోయింది... అయినా ఆమె ఇప్పటికీ నాతోనే ఉన్నట్లుంది... తను చనిపోయినప్పుడే.. తనతో పాటూ నేనూ చనిపోయాను... ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ఆరంభిస్తానని విజయ్ ఆంటోనీ ఓ ఎమోషనల్ లేఖను ట్వీట్ చేశారు. ఈ లేఖ చూసిన వారంతా.. కన్నీటి. పర్యంతమవుతున్నారు. చేతికి ఎదిగి వచ్చిన బిడ్డ చనిపోతే.. ఏ తండ్రికి అయినా ఇలానే ఉంటుందని... విజయ్ ఆంటోని ఎంత బాధపడుతున్నారనేది ఆయన లేఖను చూస్తుంటే తెలుస్తుందని అంటున్నారు. ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ.. విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తెల్లవారుజామున ఇంట్లో వాళ్లు చూసి.. వెంటనే హాస్పిటల్కు తరలించినా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos