తమిళ సూపర్‌స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఏర్పాటైన కొద్ది కాలానికే అంతర్గత సమస్యలు బయటపడుతున్నాయి. తాజాగా విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సెల్వకుమార్ పార్టీని వీడి, అధికార డీఎంకేలో చేరడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో సెల్వకుమార్ డీఎంకే కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీవీకేలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. టీవీకేలో సెల్వకుమార్‌కు అధికారికంగా ఎలాంటి పదవి లేనప్పటికీ, ఆయన విజయ్‌కు వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. సెల్వకుమార్ చేరికను డీఎంకే నేతలు స్వాగతించారు. రానున్న రోజుల్లో టీవీకే నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని వారు సూచనప్రాయంగా తెలిపారు. ఈ కీలక పరిణామంపై టీవీకే అధిష్ఠానం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సొంత పార్టీలోని సన్నిహితుడే ప్రత్యర్థి శిబిరంలో చేరడం విజయ్ కి గట్టి దెబ్బేనని చెప్పాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos