చావు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఎంత ఊహించుకున్నా అంతకు మించి ఉంటుందని  ఉగ్రవాదులకు ప్రధానమంత్రి మోదీ వార్నింగ్ ఇచ్చారు. బిహార్‌లోని మధుబనిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. ఈ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల  22న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.  ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించే ముందు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. వారి కోసం  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదని యావత్ దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ దెబ్బతో ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే టైం వచ్చిందని వార్నింగ్ ఇచ్చారు. 

"ఇవాళ ప్రపంచం మొత్తానికి చెప్తున్నా. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేస్తాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేతలను కూడా వదిలి పెట్టం. ఒక్కొక్కడిని వెంటాడి వేటాడి చంపుతాం. కనీసం వాళ్లు కలలో కూడా ఆ చావు ఊహించి ఉండరు. బిహార్ మట్టి మీద ఒట్టేసి చెబుతున్నా." అని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  "ఏప్రిల్ 22న కాశ్మీర్‌లో ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడం చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుంది. ఈ దాడిలో ఒకరు తన కొడుకును కోల్పోయారు. మరొకరు తన సోదరుడిని కోల్పోయారు.  మరొకరు తన జీవిత భాగస్వామిని కోల్పోయారు.".. "ఈ దాడి చేసిన వారికి వారు ఊహించని కఠినమైన శిక్ష పడుతుందని నేను చెబుతున్నాను. ఇప్పుడు ఉగ్రవాదుల మిగిలిన స్థావరాలు కూడా నాశనం అవుతాయి. ఉగ్రవాద సూత్రధారుల వెన్నెముక విరిచేస్తాం. ప్రతి ఉగ్రవాది కచ్చితంగా శిక్ష అనుభవిస్తాడని ప్రధాని మోదీ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos