దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అయితే ప్రణాళికా లోపాల కారణంగా ప్రయాణికులకు కలిగించిన తీవ్ర ఇబ్బందులకు సంస్థను బాధ్యుల్ని చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ, నిబంధనలు పాటించని ఏ ఎయిర్‌లైన్స్ సంస్థను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సంక్షోభం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి తెలిపారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇండిగో తన రోజువారీ సర్వీసుల్లో 5 శాతం కోత విధించాలని డీజీసీఏ ఆదేశించింది. షెడ్యూళ్లను సమర్థంగా నిర్వహించడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ప్రయాణికులకు రూ.750 కోట్లకు పైగా రిఫండ్ చేసినట్లు ఇండిగో తెలిపిందని రామ్మోహన్ నాయుడు సభకు వివరించారు. ఈ నెల‌ 5 నుంచి 15 వరకు రద్దయిన విమానాల రిఫండ్లు, బ్యాగేజీ సమస్యలు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయన్నారు.

ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రయాణికులను ఆదుకోవడానికి విమాన టికెట్ల ధరలపై పరిమితులు విధించిందని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా రీబుకింగ్‌లు చేశారని తెలిపారు. పైలట్లు, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్ప‌ష్టం చేశారు. దేశంలో పటిష్ఠ‌మైన, ప్రయాణికులే ప్రథమ ప్రాధాన్యతగా ఉండే విమానయాన రంగాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. కాగా మంత్రి ప్రకటన అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos