ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమమవుతున్న తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ గట్టి షాక్ ఇచ్చింది. ఉచిత పథకాల (freebies) విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉచిత పథకాల సంస్కృతిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి తాజాగా పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో 2024 నాటి విద్యుత్ చట్టంలోని నిబంధనలు అడ్డంకిగా మారాయి. దీంతో 2024 నాటి విద్యుత్ సవరణలోని నిబంధన 23ని సవాలు చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ నిబంధన నుంచి తమ ఉచిత పథకానికి మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్నికలకు ముందు తమిళనాడులో ఉచిత పథకాల పంపిణీపై సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు కూడా బలమైన సందేశాన్ని పంపింది. మీరు ఉచిత ఆహారం, ఉచిత విద్యుత్, ఉచిత సైకిల్ ఇవ్వడం ద్వారా ఎలాంటి సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మనం దేశవ్యాప్తంగా ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాము? విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని వారికి సంక్షేమ వ్యవస్థలో భాగంగా మీరు ఉచితాన్ని అందిస్తే అర్థం చేసుకోవచ్చని, కానీ భరించగలిగే వారికి, భరించలేని వారికి మధ్య తేడాను గుర్తించకుండా, మీరు పంపిణీ చేయడం ప్రారంభిస్తే... అది ఒక రకమైన సంతృప్తికరమైన విధానం కాదా అని నిలదీశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos