పార్లమెంటులో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న క్రమంలో... బీఆర్ఎస్ నుంచి అవిశ్వాసంపై నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తరపున చర్చలో బండి సంజయ్ పాల్గొంటున్నారు. వైసీపీ తరఫున అవిశ్వాసంపై చర్చలో మిథున్ రెడ్డి, మార్గాని భరత్.. టీడీపీ తరుఫున గల్లా జయదేవ్ పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వైసీపీ ముందుగా చెప్పినట్లుగానే వ్యతిరేకించింది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో వైసీపీ లోక్‌సభాపక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రసంగించారు. మణిపూర్‌లో మహిళలపై అత్యాచార ఘటనలు బాధాకరమని... రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే...మణిపూర్ అంశంపై చర్చించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా నిలవడంతో పాటు, ఢిల్లీలో సేవల నియంత్రణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేందుకు వైసీపీ సహకరించాలని నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.  దీంతో రాజ్యసభలో సంఖ్యా బలం లేని ఏన్డీఏ ... వైసీపీ ఎంపీల మద్దతుతో వివాదాస్పద ఢిల్లీ బిల్లుకు సులభంగా ఆమోదం పొందనుంది. కాగా.. రాజ్యసభలో 9 మంది, లోక్ సభలో 22 మంది సభ్యులున్న వైసీపీ పలు కీలక బిల్లులపై తరచూ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రభుత్వం ప్రతిపాదించిన అభ్యర్థికే అనుకూలంగా ఓటు వేసింది. తాజాగా మణిపూర్ సంక్షోభంపై లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయనున్నారు. టీడీపీకి చెందిన ఎంపీలు కూడా ఎన్డీయేకు మద్దతుగానే ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీ బిల్లు విషయంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా... ఇండియా మిత్రపక్ష కూటమికి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos