డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిలైంది. ఈ ఓటమి నేపథ్యంలో... ఛటేశ్వర్ పుజారాను మాత్రమే ఎందుకు బలి చేస్తున్నారంటూ... పలువురు క్రికెట్ అభిమానులు చేస్తున్న సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫస్ట్ ఫైనల్లో ఓడినా ... టీమిండియా అభిమానులు అంత సీరియస్గా తీసుకోలేదు కానీ... వరుసగా రెండోసారి కప్ను చేజార్చుకోవడంతో పెద్దఎత్తున విమర్శలకు దిగుతున్నారు. దీంతో భారత టీమ్ మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ దిద్దుబాటు చర్యలకు దిగింది.త్వరలో వెస్టిండీస్తో ఆడబోయే సిరీస్లో టీమిండియా జట్టులో మార్పులు చేయడంలో భాగంగా... టెస్టుల్లో జట్టుకు కీలక బ్యాటర్ అయిన ఛటేశ్వర్ పుజారాను పక్కన పెట్టడం ఉత్కంఠను రేపుతోంది. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్తో పాటు రుతురాజ్ గైక్వాడ్కు ఛాన్స్ ఇచ్చింది. ఎలాగైనా రీఎంట్రీ ఇవ్వాలనే కసిలో ఉన్న పుజారా.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో భారీ స్కోర్లు చేయాలని డిసైడ్ అయ్యాడు.
అయితే ... విండీస్ సిరీస్కు వెళ్లనున్న భారత జట్టులో పుజారాకు చోటు కల్పించకపోవడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడూ పుజారానే ఎందుకు బలి పశువును చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం చెందారు. పుజారా ఒక్కడ్నే ఎందుకు తీసేశారు... మన టీమ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్కు అతడు ఒక్కడే బాధ్యుడా అంటూ నిలదీశారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అజింక్యా రహానే తప్ప అందరూ విఫలమయ్యారు. అయినా పుజారా ఒక్కడ్నే తీసేసి.. మిగతావాళ్లను ఎలా కొనసాగిస్తారు? దీనికి సెలెక్టర్లు సమాధానం చెప్పాలంటూ గవాస్కర్ నిలదీయడాన్ని పలువురు క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos