రాజ్యసభలో నోట్ల కట్టలు దొరకడం పెద్ద దుమారమే రేపుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సీటు దగ్గర రూ. 500 నోట్ల కట్టలు దాదాపు వంద వరకు దొరికాయి. వీటి విలువ రూ.50 వేల వరకు ఉంది. ఈ డబ్బు ఎవరిదేనే అంశంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ విచారణకు ఆదేశించారు.
అసలేం జరిగిందంటే... కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద గురువారం కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించారు. దీంతో రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్యసభలో నోట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఈ విషయమై విచారణ జరగుతున్నట్టు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఈ డబ్బులు రాజ్యసభకు ఎవరు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో ఇన్వెష్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే..డబ్బులు దొరకడంపై అభిషేక్ పై పలువరు సహచర ఎంపీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నోట్ల నావి కావు అని అభిషేక్ మను సింఘ్వి వాదనకు దిగారు.
అభిషేక్ మను సింఘ్వీ... తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా.. రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించిన కె.కేశవ రావు రాజీనామా చేయడంతో జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో తెలంగాణ నుంచి సింఘ్వీ పెద్దల సభకు వెళ్లారు. గతంలో 2009లో లోక్ సభ ఎన్నికల ముందు మన్మోహన్ సింగ్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కొంత మంది బీజేపీ ఎంపీలు నోట్ల కట్టలతో లోక్ సభలో ప్రవేశించడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే.
కాగా కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్ ఖడ్ వెల్లడించారని.. ఆ నోట్లు అసలైనవో, నకిలీవో స్పష్టత లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన ఆయన, దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఖండిస్తూ... 'పేరు చెబితే తప్పేంటి..ఏ సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్ట దొరికిందో, అక్కడ ఎవరు కూర్చుంటారో ఛైర్మన్ చెప్పారని అన్నారు. అందులో సమస్య ఏముందని.. ఇలా నోట్ల కట్టలను సభకు తీసుకురావడం సరికాదని... దీనిపై సీరియస్‌గా దర్యాప్తు జరగాలని మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మరోవైపు, రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
మరోవైపు, ఎంపీ సింఘ్వీ మీడియాతో మాట్లాడుతూ... తాను రాజ్యసభ ఛైర్మన్ ప్రకటన చూసి ఆశ్చర్యపోయానని భద్రతా సంస్థలలో వైఫల్యం ఉంటే దానిని పూర్తిగా బహిర్గతం చేయాలని కోరారు. 'ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదని.. నిన్న రాజ్యసభకు వచ్చేటప్పుడు నా జేబులో కేవలం ఒక రూ.500 నోటు మాత్రమే ఉందని.. నిన్న మధ్యాహ్నం 12.57 గంటలకు సభ లోపలికి వచ్చానని... ఒంటి గంటకు సభ వాయిదా పడటం వల్ల క్యాంటీన్‌కు వెళ్లానని... మధ్యాహ్నం 1.30 గంటలకు పార్లమెంట్ నుంచి వెళ్లిపోయా' అని సింఘ్వీ
తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos