పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఓ అరుదైన రికార్డు సాధిస్తారా అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా, రాజకీయ నేతగా, పోరాట యోధురాలిగా, ట్రేడ్ యూనియన్లను నడిపిన నాయకురాలిగా మాత్రమే అందరికీ తెలిసిన మమతా బెనర్జీ ఇవాళ ఓ అరుదైన ప్రయత్నం చేయబోతున్నారు. ఏకంగా సుప్రీంకోర్టులో ఓ కీలక కేసును స్వయంగా తానే వాదించేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి అనుమతి కూడా కోరారు.

పశ్చిమబెంగాల్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ వివాదాస్పదమవుతోంది. ఇందులో ఏకంగా 58 లక్షల ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. అయితే చిన్నా చితకా కారణాలతో ఇలా భారీ ఎత్తున ఓట్లు తొలగించడం ఏంటని మమత ఈసీని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య పండుగగా చెప్పుకునే ఎన్నికల్లో ఓటర్లను పాల్గొనకుండా ఈసీ ఎలా అడ్డుకుంటుందని అడుగుతున్నారు. కానీ ఈసీ మాత్రం వెనక్కితగ్గడం లేదు. దీంతో మమత కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ కేసును స్వయంగా తానే వాదించేందుకు అనుమతి ఇవ్వాలని ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ను కోరారు.

ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు స్వయంగా హాజరవుతున్న మమతా బెనర్జీ... అక్కడికక్కడే తనకు వాదించేందుకు మరోసారి అనుమతి కోరబోతున్నారు. దీనికి ఛీఫ్ జస్టిస్ అంగీకరిస్తే మమత నేరుగా వాదనలు వినిపించేందుకు సిద్దమయ్యారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలైన మమత కొంతకాలంగా బెంగాల్ లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయితే ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు అవకాశం లభిస్తే దేశంలో తొలిసారి ఈ అవకాశం దక్కిన సిట్టింగ్ సీఎంగా ఆమె రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. ఏం జరగబోతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos