జనవరి 28 నుంచి అంటే రేపటి నుంచి పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే నిర్మలమ్మ ఈసారి కొన్ని వర్గాలకు ఊరట దక్కేలా బడ్జెట్ ప్రసంగంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. ప్రధానంగా ఆదాయపు పన్ను మినహాయింపుల్లో కూడా కొంత వెసులు బాటు ఇచ్చే ఆలోచన ఉందంటున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో పన్ను చెల్లింపుదారులకు గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే కార్యక్రమాలు చేపడుతోంది. 2020లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత, ప్రజలపై పన్నుబాధ్యతను తగ్గించే దిశగా ఏడాది విడిభాగాలలో అనేక సవరణలు చేసింది. గత ఏడాది బడ్జెట్‌లోనూ కొత్త పన్ను విధానాన్ని మరింత సరళీకరించింది.

కేంద్ర బడ్జెట్ అనగానే సగటు వేతన జీవి ఆశలన్నీ ఆదాయపు పన్ను స్లాబులపైనే ఉంటాయి. గత ఏడాది కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తూ, స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 75 వేలకు పెంచడం వల్ల ఇప్పటికే రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఊరట లభించింది. ఈసారి స్లాబుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఒక వాదన వినిపిస్తుండగా.. పాత పన్ను విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టి, ప్రజలందరినీ కొత్త విధానం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం మరిన్ని తాయిలాలు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. లక్షకు పెంచాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాత పన్ను విధానంలో కొనసాగుతున్న వారు సెక్షన్ 80C కింద ఉన్న రూ. 1.5 లక్షల మినహాయింపు పరిమితిని రూ. 3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగినందున పొదుపును ప్రోత్సహించేందుకు ఇది అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, ఈక్విటీ పెట్టుబడులపై లాభాల విషయంలో కూడా మార్కెట్ వర్గాలు కొన్ని మార్పులను ఆశిస్తున్నాయి. ప్రస్తుతం రూ. 1.25 లక్షల వరకు ఉన్న మినహాయింపును రూ. 2 లక్షల వరకు పెంచే ఆలోచన ప్రభుత్వం చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ బడ్జెట్‌లోనూ ఎప్పటిలాగే సిన్ టాక్స్ ప్రభావం పొగాకు ఉత్పత్తులపై గట్టిగా పడనుంది. ఇప్పటికే ప్రభుత్వం జనవరి 1న విడుదల చేసిన గెజిట్ ప్రకారం, సిగరెట్ల పొడవు , ఫిల్టర్ ఆధారంగా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది. ఫిబ్రవరి 1 నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. 1,000 సిగరెట్ స్టిక్స్‌పై రూ. 2,050 నుండి రూ. 8,500 వరకు పన్ను విధించడంతో ధూమపానం మరింత భారంగా మారనుంది. పొగాకు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ , గ్రీన్ ఎనర్జీ రంగాలకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు కస్టమ్స్ డ్యూటీలో మార్పులు ఉండవచ్చు. పట్టణ మౌలిక సదుపాయాల కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి కొత్త పథకాల ద్వారా నగరాల రూపురేఖలు మార్చాలని కేంద్రం భావిస్తోంది. మొత్తానికి, భారీ సంస్కరణల కంటే స్థిరత్వం , మధ్యతరగతికి స్వల్ప ఊరటనిచ్చే దిశగానే నిర్మలమ్మ అడుగులు పడేలా కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos