దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో కలసి ఏపీతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ క్రమంలో త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంశంపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటినుంచే వారి వారి అంచనాలు వెల్లడిస్తున్నారు. కేంద్రంలో 2014 వ సంవత్సరం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి వరుసగా విజయాలను సాధిస్తూ వస్తోంది. 2019 లో కేంద్రంలో బీజేపీ మెజారిటీని మరింతగా పెంచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది.
దీంతో బీజేపీ అగ్రనేతల ఆత్మవిశ్వాసం కాస్త అతి విశ్వాసంగా మారడంతో 2024 ఎన్నికల్లో ఏకంగా 400 లకి పైగా పార్లమెంటు స్థానాలను దక్కించుకుంటామని మొదటి నుండి బీరాలు పలుకుతూ వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి వచ్చిన స్థానాలు చూసి అగ్రనేతల్లో అసంతృప్తి కనిపించింది. కనీసం 350 స్థానాలు అయినా ఈ పార్టీకి వస్తాయని జనాలు కూడా అంచనా వేశారు. అయితే బీజేపీ నేతల ఆశలు అడియాశలై... అనూహ్యంగా ఈ పార్టీకి చాలా తక్కువ పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. కచ్చితంగా మెజారిటీ ఎంపీ స్థానాలు సాధిస్తామని అనుకున్న కొన్ని రాష్ట్రాలలో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన దుస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనబడుతుండటంతో ఆ పార్టీ అగ్రనేతల్లో ఆందోళన నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర లో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని... ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు లేవని వారు అంటున్నారు. ఇక జార్ఖండ్ లో కూడా దాదాపుగా గెలిచే పరిస్థితులు లేవనే విశ్లేషణలు వెలువబడుతున్నాయి. ఇకపోతే హర్యానా లో కూడా బీజేపీకి గెలిచే అవకాశాలు లేవని , అక్కడ కాంగ్రెస్ భారీ స్థానాలను దక్కించుకొని అధికారంలోకి రాబోతుందని తాజా సర్వేలు చెబుతున్నాయని వారు అంటున్నారు.
ఇక బీహార్ లో కూడా బీజేపీ కి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని... తీవ్రంగా పోరాడితే తప్ప బీజేపీ గెలిచే అవకాశాలు లేవని సర్వేలు చెబుతున్నాయని వారు అంటున్నారు ఇలా ఈ 4 రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆ రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో... ఏం జరగబోతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos