రెజ్లర్ల నిరసనల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెజ్లింగ్​ ఫెడరేషన్​ చీఫ్​ బ్రిజ్​ భూషణ్​ శరణ్​ సింగ్​కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న రెజ్లర్లు సాక్షి మాలిక్​, వినేశ్​ ఫోగట్​, బజరంగ్​ పునియాలు.. తిరిగి ఉద్యోగాల్లో చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు బ్రిజ్​ భూషణ్​పై రెజ్లర్లు శనివారం రాత్రి అమిత్​ షాతో భేటీ అయిన తరువాత ఈ కీలక పరిణామం చోటు చేసుకుందని సమాచారం. మహిళా రెజ్లర్లు, మైనర్లపై బ్రిజ్​ భూషణ్​ లైంగిక దాడికి పాల్పడినట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. జనవరిలో నిరసనలు చేసి కొన్నిరోజుల తర్వాత విరమించుకున్నారు. కానీ మళ్లీ ఏప్రిల్​ నెలలో ఆందోళనలను ఉద్ధృతం చేశారు.

బ్రిజ్​ భూషణ్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని, అతన్ని అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేస్తూ ఆందోళనలు కొనసాగించారు. అప్పటివరకు కదలమంటూ ఢిల్లీ జంతర్​మంతర్​ వద్ద క్యాంప్​ను ఏర్పాటు చేసుకున్నారు. కాగా మే నెలాఖరులో ఈ క్యాంప్​ను పోలీసులు తొలగించారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు, అంటే మే 31.. సాక్షి మాలిక్​, వినేశ్​ ఫోగట్​, బజరంగ్​ పునియాలు వారివారి రైల్వే ఉద్యోగాల్లో చేరారు. అయితే.. విధుల్లో చేరినంత మాత్రాన మేము నిరసనలు ఆపేసినట్లు కాదని రెజ్లర్లు చెబుతున్నారు. రెజ్లర్లు గత శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో భేటీ అయి... బ్రిజ్ భూషణ్​పై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. 'చట్టం అందరికి ఒకే విధంగా ఉంటుంది.

చట్టం దాని పని దానిని చేసుకోనివ్వండి,' అని రెజ్లర్లకు అమిత్​ షా చెప్పారని... ఆయన స్పందనపై రెజ్లర్లు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మేమింకా నిరసనలు ఆపేయలేదని... ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేయాల్సిన పెండింగ్ వర్క్ ఉండటంతో కార్యాలయానికి వచ్చామని చెప్పారు. తాము నిరసన దీక్షలు ఉపసంహరించలేదని, రెజ్లర్ల తదుపరి కార్యాచరణ ఏమిటి? అహింసాయుత పద్ధతిలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వ్యూహరచన చేస్తున్నామని తెలిపారు.  రైల్వేస్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (క్రీడలు)గా నాకు చాలా బాధ్యతలు ఉంటాయని, ఓఎస్‌డీగా కొన్ని పెండింగ్ పనులు ఉన్నందున విధులకు హాజరయ్యానని సాక్షి మాలిక్ తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై చేసిన ఫిర్యాదులను కొందరు రెజ్లర్లు ఉపసంహరించుకున్నట్టు వస్తున్న వార్తలపై అడిగినప్పుడు, అవన్నీ అభూతకల్పనలేనని సమాధానమిచ్చారు. న్యాయం జరిగేంతవరకూ తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. రెజ్లర్ల పోరాటం ఎంతవరకు సాగుతుందో మరి చూడాలి.

 

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos