వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ చేసిన భారీ స్కోరుకు బదులుగా భారత్ 150 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేయగా.... రెండో రోజు లంచ్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట చివరికి 38 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది.
ఈ క్రమంలో... పదేండ్లుగా ఐసీసీ ట్రోఫీ లేదనే బాధ.. ఈసారైనా తెస్తారనే ఆశ మధ్య టీమిండియా ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతుండగా... డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచినా బ్యాటింగ్ ఆసీస్ కు అప్పగించింది. అశ్విన్ ను తుది జట్టులోంచి తప్పించి ... అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్న టీమిండియాకు మ్యాచ్ ఫలితంపై ఇసుమంతైనా ఆవేదన లేదా అని ఫ్యాన్స్ ... టీమిండియాను నిలదీస్తున్నారు.
టీమిండియా ఇంత పేలవంగా ఆడటంపై ... ఆటగాళ్లపై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఐపీఎల్ లో వందలాది మ్యాచ్‌ల వలే ... ఇది కూడా... తొక్కలే గెలిస్తే గెలుస్తాం.. ఓడితే ఓడుతాం అన్న భావనలో ఆటగాళ్లు ... ఉన్నట్టున్నారని... తొలి రోజుతో పాటు నిన్న కూడా అదే నిర్లక్ష్యం.. అదే లెక్కలేనితనం ప్రదర్శించారంటూ... అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక... ‘సేవియర్, ఛేజ్ మాస్టర్’ అంటూ ఊదరగొట్టిన విరాట్ కోహ్లీని అభిమానులు ఓ రేంజ్ లో విమర్శించారు.
మ్యాచ్ ఏమవుతుందోనని మేమంతా ఆందోళన చెందుతుంటే ... 31 బంతుల్లో 14 పరుగులు చేసిన కోహ్లీ... స్టార్క్ బౌలింగ్ లో స్లిప్స్ లో స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడని... తీవ్రంగా విమర్శిస్తున్నారు. అభిమానులు కోహ్లీ ని అంతటితో వదిలి పెట్టలేదు. కోహ్లీ ఔట్ అయిన వెంటనే పెవిలియన్ కు వెళ్లి.. ‘ఇంత క్రిటికల్ సిట్యూయేషన్ లో ఔటయ్యా’ అన్న చింత ఏమాత్రం లేకుండా ... తాపీగా ప్లేట్ లో ఏదో పెట్టుకుని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేశాడని... టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ లతో జోకులు చేసుకుంటూ పుష్టిగా తింటూ కనిపించాడని మండిపడ్డారు. కోహ్లీ వ్యవహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ పట్టరాని ఆగ్రహావేశంతో కామెంట్స్ పెడుతున్నారు.
‘మ్యాచ్ ఏమైపోతే మీకేంటి...? మీకు తిండే ముఖ్యం..’, ‘తినండి, పడుకోండి.. షాపింగులు చేసుకుని ఇండియాకు వచ్చి ఐపీఎల్ లో ... ఆహా ఓహో అనేలా రికార్డులు చేసుకోవడం తప్ప మీరు చేసిందేముంది..? మా బాధలు మీకేం తెలుస్తాయి..?’ అని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరికొందరు... ‘అసలు మేం ఇంత టెన్షన్ లో ఉంటే మీకు ఎలా తినబుద్ధి అవుతుందన్నా...’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది... ‘కోహ్లీ అన్న కూడా మనలాగేరా... జీవితం ఎలా ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా పట్టించుకునేదే లేదు.. బిందాస్ గా తినడం ... తిరగడం లైఫ్ ఎంజాయ్ చేయడం... మిగతా విషయాలన్నీ మరిచిపోవడం..’అని స్పందిస్తున్నారు.
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ రెండో ఆట ముగిసే సమయానికి టీమిండియా.. 38 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తమ్మీద టీమిండియా ఆట తీరుపై గుర్రుగా ఉన్న అభిమానులు కోహ్లీపై... ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తూ... వారి ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు.
యూట్యూబ్ లైవ్
LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam